Loading...
Varanasi movie: వారణాసి కోసం జక్కన్న కొత్త భాష.. కిలికిలిని మించేలా భాషా ప్రయోగం!
వారణాసి కోసం జక్కన్న కొత్త భాష.. కిలికిలిని మించేలా భాషా ప్రయోగం!

Varanasi movie: వారణాసి కోసం జక్కన్న కొత్త భాష.. కిలికిలిని మించేలా భాషా ప్రయోగం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు రాజమౌళి సినిమాల్లో కథ,పాత్రలు,ప్రపంచ నిర్మాణం మాత్రమే కాదు.. భాషలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సృష్టించే కొత్త ప్రపంచాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంటాయి. ఇప్పుడు 'వారణాసి' విషయంలోనూ అలాంటి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా వినిపిస్తున్న ఓ ఆసక్తికరమైన విషయం మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. 'వారణాసి' కోసం ఓ సరికొత్త భాషను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారతీయ సినిమాలో ప్రత్యేకంగా కనిపించిన భాషా ప్రయోగాలను మించి ఉండేలా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో కాళికేయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'కిలికిలి' భాష ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే.

వివరాలు 

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కొత్త భాష

సినిమా విడుదల తర్వాత ఆ భాష ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.

'వారణాసి' కథ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందనే విషయం ఇప్పటికే వెల్లడైంది.

ఇందులో హీరోతో పాటు అతడి బృందం కాలంలో ప్రయాణించి ఓ గుహలోకి వెళ్లే సందర్భం ఉంటుందని తెలుస్తోంది.

ఆ గుహలో నివసించే వ్యక్తులు తమ మధ్య మాట్లాడుకునేందుకు సాధారణంగా ఉన్న ఏ భాషనూ ఉపయోగించరట. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త భాషను సినిమాలో చూపించనున్నట్లు సమాచారం.

వివరాలు 

భాషను డీకోడ్ చేసే సీన్

ఈ కొత్త భాషను సినిమాలో కేవలం చూపించడమే కాకుండా.. దాన్ని అర్థం చేసుకునే విధంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని కూడా రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గుహలోని వ్యక్తులు మాట్లాడే భాషను హీరో బృందం డీకోడ్ చేసే సీన్ కథలో కీలకంగా ఉండొచ్చని సమాచారం.

ఈ ప్రత్యేక భాషను రూపొందించేందుకు రాజమౌళి ఓ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

'బాహుబలి'లో కిలికిలి భాషకు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. 'వారణాసి'లోని కొత్త భాషను మరింత ప్రత్యేకంగా, ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

కిలికిలిని మించేలా..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' కోసం రూపొందిస్తున్న ఈ కొత్త భాష 'కిలికిలి' కంటే మరింత ఆసక్తికరంగా ఉండబోతుందట.

సినిమాలోని కథా ప్రపంచానికి అనుగుణంగా భాషను రూపొందించడంతో పాటు.. దాని వెనుక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే 'వారణాసి'లోని ఈ కొత్త భాష కూడా సినిమా విడుదల తర్వాత ప్రత్యేక చర్చకు దారితీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

'కిలికిలి' మాదిరిగానే ఈ భాష కూడా ప్రేక్షకుల్లో ఆదరణ పొందడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT