NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు
    తదుపరి వార్తా కథనం
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు
    మహేష్ బాబు 28 లో బాలీవుడ్ భామకు అవకాశమే లేదు

    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 01, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్ లో వేగంగా షూటింగ్ కావస్తోంది.

    ఈ సినిమా ప్రధాన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెట్లోంచి పూజా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఐతే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని అన్నారు.

    అందులో ఒక హీరోయిన్ ప్లేస్ లో ధమాకా తో దూసుకొచ్చిన శ్రీలీల చేస్తుందనీ, మరొక హీరోయిన్ గా బాలీవుడ్ భామ భూమి ఫడ్నేకర్ కనిపించనుందని పుకార్లు వినిపించాయి.

    ఇప్పుడు ఈ విషయమై స్పష్టత వచ్చినట్లు సోషల్ మీడియా చర్చల్లో తెలుస్తోంది.

    మహేష్ బాబు

    బాలీవుడ్ భామకు నో ఛాన్స్

    రెండవ హీరోయిన్ గా శ్రీలీల ఉంటుందనీ, కానీ మూడవ హీరోయిన్ గా బాలీవుడ్ భామ డౌటే అని అంటున్నారు. ఇటు పూజా హెగ్డేకు, అటు శ్రీలీలకు మంచి పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.

    ఇప్పుడు బాలీవుడ్ భామ భూమి ఫడ్నేకర్ ని తీసుకుంటే సినిమా బడ్జెట్ మరింత పెరుగుతుందని, అందువల్ల బాలీవుడ్ భామను వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది.

    సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండడం సహజమే. కానీ అందరూ స్టార్ హీరోయిన్స్ అయితే ఆ ప్రభావం సినిమా బడ్జెట్ మీద ఉంటుందని ఊరుకుంటున్నారట.

    కాకపోతే మూడవ హీరోయిన్ ని ఎవరిని తీసుకోవాలా అని ప్రస్తుతం ఆలోచిస్తున్నారట. మరి మూడవ హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    మహేష్ బాబు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ తెలుగు సినిమా
    క్రితిసనన్ తో ఎంగేజ్ మెంట్ వార్తలపై స్పందించిన ప్రభాస్ టీమ్ తెలుగు సినిమా
    కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ కాదు భాస్కర్ కూడా రాదు - ప్రకాష్ రాజ్ సినిమా
    కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల ఓటిటి

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025