పవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, కొత్త సినిమాలు రావాలనీ, అన్నీ కొత్తగా ఉండాలనీ, వింత పోకడలకు పోతున్న సమయంలో వచ్చిన ధమాకా, అందరి నోళ్ళను మూయించిందని చెప్పాలి.
ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందులో నటించిన శ్రీలీలకు వరుస పెట్టి అవకాశాలు వస్తుండడమే అందుకు ఉదాహరణ. తాజాగా శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
చేతిలో అరడజను పైగానే సినిమాలున్న శ్రీలీలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వినిపిస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, సముద్రఖని చేస్తున్న రీమేక్, ఓజీ, ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్.
పవన్ కళ్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన ఛాన్స్?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలకు అవకాశం వచ్చిందని అంటున్నారు.
ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ సోషల్ మీడియాలో కుప్పల కొద్దీ వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమేనా లేదా అనేది తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు ఆగాల్సిందే.
ఒకవేళ ఇదే నిజమైతే, శ్రీలీలకు మంచి అవకాశం లభించినట్లే అని చెప్పుకోవచ్చు. మరేం జరుగుతుందో చూడాలి.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.