Page Loader
Shanthi Priya : గుండుతో చిరునవ్వు... నిజమైన బ్యూటీకి అర్థం చెప్పిన స్టార్ హీరోయిన్
గుండుతో చిరునవ్వు... నిజమైన బ్యూటీకి అర్థం చెప్పిన స్టార్ హీరోయిన్

Shanthi Priya : గుండుతో చిరునవ్వు... నిజమైన బ్యూటీకి అర్థం చెప్పిన స్టార్ హీరోయిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు టాలీవుడ్‌లో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ శాంతి ప్రియ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడానికి జుట్టుకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే జుట్టు సంరక్షణ కోసం ఎన్నో క్రీములు, థెరపీలు కూడా వాడుతూ ఉంటారు. అయితే శాంతి ప్రియ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ గుండు గీయించుకుని, అందంపై తనదైన అభిప్రాయాన్ని చెప్పింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేస్తూ.. తాను గుండు గీయించుకున్న విషయాన్ని వెల్లడించింది. ఇటీవలే నేను గుండు గీయించుకున్నాను.

Details

శాంతి ప్రియ వ్యాఖ్యలు వైరల్

ఒక అమ్మాయిగా ఈ సమాజంలో ఎన్నో నియమాలు, పరిమితులు ఉన్నాయి. అయితే వాటికి నేను భయపడను. ఎందుకంటే నాకు అందం అనేది కేవలం దేహంతో సంబంధం లేని విషయం. నిజమైన అందం అంటే ఆత్మవిశ్వాసం. మన మనసు ఎలా ఉందో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే నిజమైన అందం. ఇంకెన్నాళ్లూ ఈ ఆచారాలకు బానిసలా జీవించాలి? మనకు నచ్చినట్టుగా జీవించాలంటూ ఓ బలమైన సందేశాన్ని ఇచ్చారు. శాంతి ప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంతో మందికి ఆమె ధైర్యం ప్రేరణగా మారుతోంది. భానుప్రియ సోదరిగా మాత్రమే కాకుండా, శాంతి ప్రియ తన స్వతంత్రమైన ఆలోచనలతో మరోసారి మెప్పించారు.