Loading...
Mandaadi Teaser : 'మండాడి' టీజర్ విడుదల.. సముద్రంలో పడవల రేసు.. ఆసక్తికరంగా సినిమా

Mandaadi Teaser : 'మండాడి' టీజర్ విడుదల.. సముద్రంలో పడవల రేసు.. ఆసక్తికరంగా సినిమా

వ్రాసిన వారు Moogati Shabari
Aug 27, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మండాడి'. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వివరాలు

సినిమాపై భారీ అంచనాలు..

'మండాడి' చిత్రాన్ని సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు.

తాజాగా చిత్రబృందం 'మండాడి' టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌ను పరిశీలిస్తే.. సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే జాలర్ల జీవితాలు, వారి మధ్య చోటుచేసుకునే వివాదాలు ప్రధానంగా కథలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సముద్రంలో జరిగే పడవల పోటీ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చిత్రబృందం ఆసక్తికరమైన కంటెంట్‌ను చూపించింది.

ADVERTISEMENT