LOADING...
హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్
డీజే ఆపరేటర్ గా రోషన్ కనకాల

హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 16, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు యాంకర్ అనే మాటకు మరో అర్థంగా మారిపోయిన యాంకర్ సుమ, తన కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల.. హీరోగా మారుతున్నాడు. అది కూడా అడవి శేష్ తో క్షణం, సిద్ధు జొన్నలగడ్డ తో క్రిష్ణ అండ్ హిస్ లీల తెరకెక్కించిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో కావడం విశేషం. ఈ మేరకు ఆ చిత్రంలోంచి రోషన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో, డీజే ఆపరేటర్ గా రోషన్ కనిపిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా, మహేశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యాంకర్ సుమ కొడుకు హీరోగా క్షణం డైరెక్టర్ తో సినిమా