Page Loader
Jaat : టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్.. తెలుగులో జాట్ రిలీజ్ డేట్ ఫిక్స్! 
టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్.. తెలుగులో జాట్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Jaat : టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్.. తెలుగులో జాట్ రిలీజ్ డేట్ ఫిక్స్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

'గదర్ 2' చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాట్'. ఈ సినిమాకు తెలుగు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. సన్నీ డియోల్‌కు జోడీగా రెజీనా కసాండ్రా నటించగా, ప్రతినాయకుడిగా రణదీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి నటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ముంబైలో గ్రాండ్ ప్రీమియర్‌ను నిర్వహించనున్నారు.

Details

వచ్చే వారం రిలీజ్

ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ ప్రముఖ నటులను ఆహ్వానించినట్లు సమాచారం. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో ఈ చిత్రం ఉండడంతో, బాలీవుడ్‌లో మైత్రి మూవీ మేకర్స్‌కి ఇది గేమ్ చేంజర్‌గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం తెలుగులో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హిందీ వెర్షన్‌కు వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా తెలుగులో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారట. దీనికి గల కారణం దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాణ సంస్థలు తెలుగు వారు కావడమే విశేషం. అలాగే ఈ చిత్రంలో నటించిన మరికొంత మంది నటీనటులు కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనవారే కావడం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.