Page Loader
A22 x A6: అట్లీ - బన్నీ కాంబోలో సర్ప్రైజ్.. 20 ఏళ్లు కుర్రాడు మ్యూజిక్ డైరక్టర్!
అట్లీ - బన్నీ కాంబోలో సర్ప్రైజ్.. 20 ఏళ్లు కుర్రాడు మ్యూజిక్ డైరక్టర్!

A22 x A6: అట్లీ - బన్నీ కాంబోలో సర్ప్రైజ్.. 20 ఏళ్లు కుర్రాడు మ్యూజిక్ డైరక్టర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. 'పుష్ప 2'తో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, తన తదుపరి సినిమా అప్‌డేట్‌ను జన్మదినం కానుకగా విడుదల చేశారు. ఈసారి అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఫిల్మ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు లాస్ ఏంజెల్స్‌లో షూట్ చేసిన వీడియోను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్, అట్లీతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా కనిపించి, ప్రాజెక్ట్‌పై ఆసక్తిని రెట్టింపు చేశారు.

Details

సాయి అభయంశకర్ ఎంపిక

'A22 x A6' టైటిల్‌తో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా 20 ఏళ్ల యువకుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. అతనెవరో కాదు.. తమిళ సంగీత ప్రపంచంలో యువతకు క్రేజ్ తెచ్చుకున్న సాయి అభయంకర్ (Sai Abhyankkar)! గతేడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన 'కచ్చిసేరా', 'ఆసై కూడా' వంటి పాటలను కంపోజ్ చేసి, నటించి పేరు తెచ్చుకున్న సాయి.. ప్రఖ్యాత గాయకులైన టిప్పు-హరిణిల కుమారుడు. చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న అతడు ఇటీవల 'బెంజ్'అనే తమిళ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసి మంచి గుర్తింపు పొందాడు.

Details

త్వరలో మరిన్ని వివరాలు

ప్రస్తుతం మరో రెండు మూడు ప్రాజెక్టుల్లోనూ పని చేస్తున్న సాయి, ఇప్పుడు మాత్రం ఏకంగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ సినిమాలోనే సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త సంచలనంగా మారింది. ఒక 20 ఏళ్ల యువకుడికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడాన్ని చూసి నెటిజన్లు 'సాహసమే' అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తున్న మేకర్స్ నిర్ణయం పట్ల ప్రశంసలు కూడ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా రానున్నాయి.