LOADING...
The Paradise : నాని 'ది పారడైజ్' రిలీజ్‌పై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
నాని 'ది పారడైజ్' రిలీజ్‌పై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

The Paradise : నాని 'ది పారడైజ్' రిలీజ్‌పై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాని హీరోగా నటిస్తున్న భారీ అంచనాల చిత్రం 'ది పారడైజ్' షూటింగ్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. ఇటీవల సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన, ఈ సందర్భంగా 'ది పారడైజ్'కు సంబంధించిన ప్రశ్నలకు స్పందించారు. సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇప్పటివరకు దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యిందని వెల్లడించారు.

Details

సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్

సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ పూర్తయ్యాయని, అలాగే పాటలు, ఫైట్ సీక్వెన్సులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మిగిలింది కేవలం టాకీ పార్ట్ మాత్రమేనని, దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అయితే, సినిమా విడుదల తేదీపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ముందుగా ప్రకటించిన డేట్‌కే సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఒకవేళ అది సాధ్యపడకపోతే సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Details

రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావు

ఇదే సమయంలో రామ్ చరణ్ సినిమా విడుదలతో పోటీ ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందించిన సుధాకర్ చెరుకూరి, రామ్ చరణ్ తమకు స్నేహితుడేనని, అందువల్ల రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేసే అవకాశం తక్కువేనని చెప్పారు. అవసరమైతే వేర్వేరు సమయాల్లో రిలీజ్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. మొత్తానికి, ప్రస్తుతం 'ది పారడైజ్' విడుదల తేదీపై పూర్తి క్లారిటీ లేదని నిర్మాత స్పష్టం చేశారు. సినిమాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు అర్థమవుతోంది.

Advertisement