Page Loader
Taapsee Pannu: చిరకాల ప్రియుడిని చేసుకోనున్న తాప్సీ ..వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే.. 
చిరకాల ప్రియుడిని చేసుకోనున్న తాప్సీ ..వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే..

Taapsee Pannu: చిరకాల ప్రియుడిని చేసుకోనున్న తాప్సీ ..వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2024
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాప్సీ పన్ను తన బాయ్‌ఫ్రెండ్,బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పేస్తుందట. ఇండియాటుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో,తాప్సీ త్వరలో మథియాస్‌ను వివాహం చేసుకోనుందని తెలిపారు. NDTV నివేదిక ప్రకారం,వివాహ వేడుకలు మార్చి చివరిలో ఉదయ్‌పూర్‌లో జరుగుతాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు,బాలీవుడ్ సినీ ప్రముఖులు,సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సిక్కు, క్రిస్టియన్ సంస్కృతి కలయికగా ఈ పెళ్లి జరగాలని భావిస్తున్నారు. తాప్సీకి కాబోయే భర్త మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అతడు రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్.. ఒలింపిక్ పతక విజేత కూడా. అయితే ఈ వార్తలను తాప్సీ ఇంకా ధృవీకరించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మథియాస్ బోను వివాహం చేసుకోనున్న తాప్సి