NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tapsee: ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నహీరోయున్? 
    తదుపరి వార్తా కథనం
    Tapsee: ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నహీరోయున్? 
    ప్రియుడిని రహస్యంగా పెళ్లిచేసుకున్నహీరోయున్?

    Tapsee: ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నహీరోయున్? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినీ నటి తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడు మథియాస్ బోను రహస్యంగా వివాహం చేసుకుంది.

    నివేదికల ప్రకారం,ఆమె మార్చి 23 న ఉదయపూర్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకుంది.

    తాప్సీ,మథియాస్ చాలా కాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు.కొన్ని రోజులుగా వారి పెళ్లి గురించి వార్తలు వచ్చాయి,అయితే తాప్సీ దానిని ధృవీకరించలేదు.

    వీరి పెళ్లికి అతి కొద్ది మంది అతి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని రిపోర్టులు చెబుతున్నాయి.

    వివాహానికి హాజరైన అతిథులలో పావైల్ గులాటి,దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు.

    సిక్కు,క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారమే వీరిద్దరి వివాహం జరగనుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి.

    వీరిద్దరి వివాహ వేడుకలు మార్చి 20న ప్రారంభమై మార్చి 23న పెళ్లితో ముగిశాయి.

    Details 

    ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోను షేర్ చేసిన పావైల్ గులాటీ

    రెండు రోజుల క్రితం తన సన్నిహితుడు పావైల్ గులాటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోను షేర్ చేశాడు.

    తాప్సీ పన్నుతో కలిసి అనేక చిత్రాలలో పనిచేసిన రచయిత్రి కనికా ధిల్లాన్ నిన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు.

    ఈ చిత్రాలు కూడా తాప్సీ వివాహ వేడుకకు సంబంధించినవే అని చెబుతున్నారు. కనికా, తాప్సీ హసీన్ దిల్రూబా, మన్మర్జియాన్, డాంకీ , ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.

    Details 

    మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు

    తాప్సీ పన్ను,మథియాస్ 2013లో మొదటిసారి కలిశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆడేందుకు మథియాస్ భారతదేశానికి వచ్చినప్పుడు, తాప్సీ మథియాస్ ను కలుసుకుంది.

    మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.

    నటి తాప్సీ వివాహం సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బాలీవుడ్

    Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్‌ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష  ముంబై
    Dunki Teaser: కింగ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. సర్‌ప్రైజ్ అదిరింది! షారుక్ ఖాన్
    Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో) ముంబై
    Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు  సల్మాన్ ఖాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025