Hero Arya: తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ నటుడు ఆర్య (అసలు పేరు శంషాద్)తో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మోసం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం, 'అనంతన్‌కాడు' చిత్ర నిర్మాణం కోసం ఆయా సంస్థలు తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ నుంచి సుమారు రూ.2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్ పరికరాలను అద్దెకు తీసుకున్నాయి.
వివరాలు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
అయితే మొత్తం బిల్లులో కేవలం రూ.42 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.1.80 కోట్ల బకాయితో పాటు జీఎస్టీ చెల్లింపులను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచి మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ అకౌంట్స్ హెడ్ సయ్యద్ జావీద్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బకాయి మొత్తాన్ని కోరిన సందర్భంలో తమ సంస్థ మేనేజర్‌ను బెదిరింపులకు గురి చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.