Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.ఆయన లైవ్ షోలతో పాటు వాటికీ సంబంధించి ఉండే వివాదాలు దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో దిల్జిత్ కాన్సర్ట్ నిర్వహించబడనుంది. ఈ క్రమంలో,ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల ప్రకారం, పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకుండా ఉండమని సూచించారు. WHO మార్గదర్శకాలు ప్రకారం,లైవ్ షోల సమయంలో లౌడ్ మ్యూజిక్, ఫ్లాష్ లైట్లు ఉంటాయని, ఈ కారణంగా పిల్లలను వేదికపైకి ఎక్కించకూడదని ఆదేశించారు. అంతేకాదు, మద్యం, మాదకద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలను వేదికపై పాడకూడదని హెచ్చరించారు.
లైవ్ షోలో 120 dB కంటే ఎక్కువ శబ్దం.. పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదు
WHO మార్గదర్శకాల ప్రకారం, పెద్దలపై 140 dB కన్నా ఎక్కువ శబ్ద ఒత్తిడి పడకూడదని, పిల్లలు 120 dB కన్నా ఎక్కువ శబ్దం తట్టుకోలేకపోవచ్చని చెప్పారు. అందువల్ల, లైవ్ షోలో 120 dB కంటే ఎక్కువ శబ్దం ఉన్నందున, పిల్లలను వేదికపైకి తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. అలాగే, నోటీసులో, దిల్జిత్ గత కచేరీలలో మద్యం, మాదకద్రవ్యాలను ప్రోత్సహించే పాటలు పాడిన వీడియోలను ఆధారంగా చూపించి, అలాంటి పాటలను రిపీట్ చేయరాదని సూచించారు. ఈ వివాదం ఇంతకుముందు ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన దిల్-లుమ్నాటి సంగీత కచేరీలో కూడా వెలుగులోకి వచ్చింది. అక్కడ దిల్జిత్ పాడిన పాటలు "పాటియాలా పెగ్","పంజ్ తారలా"వంటి వాటి గురించి కూడా అనేక చర్చలు జరిగాయి.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్ కచేరీ
గత కొన్ని నెలలుగా, దిల్జిత్ లైవ్ షోలపై తీవ్ర వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్ కచేరీ జరిగింది. ఈ కార్యక్రమం ముగియడంతో, స్టేడియంలో చెత్త వ్యాపించడమే కాకుండా, మద్యం, వాటర్ బాటిళ్లను అక్కడక్కడ విసిరేయడం జరిగింది. కుర్చీలు విరిగి, రన్నింగ్ ట్రాక్‌పై కుళ్ళిపోయిన ఆహారం పడి ఉండడం చూసి అందరూ అంగీకరించలేదు. ఈ చెత్త కారణంగా, ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను నిలిపి వేయాల్సి వచ్చిందని తెలిపారు.