Loading...
Jailer 2: రజనీకాంత్‌ సినిమాలో నటించాలంటే ఆ కండిషన్‌ తప్పనిసరి.. మిథున్‌ చక్రవర్తి కామెంట్స్‌ వైరల్
రజనీకాంత్‌ సినిమాలో నటించాలంటే ఆ కండిషన్‌ తప్పనిసరి.. మిథున్‌ చక్రవర్తి కామెంట్స్‌ వైరల్

Jailer 2: రజనీకాంత్‌ సినిమాలో నటించాలంటే ఆ కండిషన్‌ తప్పనిసరి.. మిథున్‌ చక్రవర్తి కామెంట్స్‌ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జైలర్‌ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుండగా.. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి పెట్టిన కండిషన్‌ చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

హీరో చేతిలో దెబ్బలు తినకూడదట!

'జైలర్‌ 2'లో నటించేందుకు మిథున్‌ చక్రవర్తి ఓ ఆసక్తికరమైన షరతు పెట్టారట. తన పాత్రను హీరో కొట్టకూడదని, తనపై కాల్పులు జరిపే సన్నివేశాలు కూడా ఉండకూడదని చెప్పినట్లు రజనీకాంత్‌ వెల్లడించారు.

ఇటీవల నిర్వహించిన 'జైలర్‌ 2 సూపర్‌ షో' కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. సినిమా బృందం తొలుత మిథున్‌ చక్రవర్తిని సంప్రదించినప్పుడు.. ఆయన తన పాత్ర గురించి పూర్తి వివరాలు అడిగారట.

ఒకవేళ సినిమాలో విలన్‌గా నటిస్తే హీరో చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందా? అని ప్రశ్నించారట.

తనను కొట్టే సన్నివేశాలు ఉంటే ఆ సినిమాలో నటించనని సరదాగా చెప్పినట్లు రజనీకాంత్‌ తెలిపారు.

వివరాలు

రజనీకాంత్‌ అడిగితే నటిస్తానన్న మిథున్‌!

ఆ తర్వాత జరిగిన వేవ్స్‌ సమ్మిట్‌ కార్యక్రమంలోనూ రజనీకాంత్‌, మిథున్‌ చక్రవర్తి మధ్య 'జైలర్‌ 2' ప్రస్తావన వచ్చిందట.

రజనీకాంత్‌ అడిగితే సినిమాలో నటించేందుకు తాను సిద్ధమేనని మిథున్‌ చెప్పారట. అయితే, తనను కొట్టే సన్నివేశాలు ఉండకూడదని, కాల్చడం వంటి సన్నివేశాలు కూడా చేయకూడదని స్పష్టం చేశారట.

దీనిపై స్పందించిన రజనీకాంత్‌.. మిథున్‌ పెట్టిన కండిషన్ల గురించి దర్శకుడు నెల్సన్‌తో మాట్లాడి చెబుతానని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.

దీంతో మిథున్‌ చక్రవర్తి పెట్టిన ఈ సరదా షరతు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

అక్టోబర్‌ 15న 'జైలర్‌ 2' విడుదల

నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, ఎస్‌.జె. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు 'జైలర్‌ 2' హిందీ విడుదల ఆలస్యం కానుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి.

వీటిపై చిత్ర బృందం స్పందించింది. హిందీలోనూ ఈ సినిమా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 15న విడుదలవుతుందని స్పష్టం చేసింది.

ఈ విషయంలో అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయాలని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT

వివరాలు

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న సినిమా

విడుదలకు ముందే 'జైలర్‌ 2' అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా కోసం 6 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

రజనీకాంత్‌ నటన, నెల్సన్‌ దర్శకత్వం, భారీ తారాగణంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ADVERTISEMENT