Mrithyunjay Trailer: సమాధానం చెప్పక తప్పదు.. ఆసక్తి రేపుతున్న మృత్యుంజయ్ ట్రైలర్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 28, 2026
11:47 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు హీరోగా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మృత్యుంజయ. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో ఒక చిన్న పాప కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన వ్యక్తిగా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. ఆ పాప అడిగిన ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెబుతానని ఇచ్చిన హామీ కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.