Page Loader
Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ!
'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ!

Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ నటిస్తున్న 'స్పిరిట్‌' చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. అయినప్పటికీ, ఈ చిత్రంపై వస్తున్న వార్తలు సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ వంటి ప్రముఖ నటులను ప్రత్యేక పాత్రలలో చూపించనున్నారు. ఈ భార్యభర్తలు చిత్రంలో నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తలను ధృవీకరించడమే కాకుండా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఈ జంటను కలసి, వారికి కథ, పాత్రలను వివరించినట్లు సమాచారం.

Details

హాలీవుడ్ స్థాయిలో 'స్పిరిట్'

అయితే ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారన్న వార్తలు అభిమానులను అలరిస్తున్నాయి. కానీ, వీటిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనలు రాలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్, వైల్డ్ ఎలిమెంట్స్‌తో 'స్పిరిట్‌'ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. టి. సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.