Page Loader
The Rajasaab : ప్రభాస్ హర్రర్ ట్రీట్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ది రాజాసాబ్' టీజర్ రేపే!
ప్రభాస్ హర్రర్ ట్రీట్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ది రాజాసాబ్' టీజర్ రేపే!

The Rajasaab : ప్రభాస్ హర్రర్ ట్రీట్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ది రాజాసాబ్' టీజర్ రేపే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమాకు సంబంధించిన టీజర్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రేపు సోమవారం, జూన్ 16న ఉదయం 10:52 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ఒక ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హర్రర్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హర్రర్ జానర్‌లో ప్రభాస్‌కి ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఇంతకుముందు విడుదలైన పోస్టర్లు, ప్రభాస్ లుక్‌ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ డేట్ వీడియో కూడా బాగా ఇంట్రిగింగ్‌గా ఉండటంతో మరింత హైప్ పెరిగింది.

Details

డిసెంబర్ 5న రిలీజ్

ఆ వీడియోలో ఓ పాడుబడిన ఇంటి ముందు హీరోయిన్ మాళవిక మరో ఇద్దరు హీరోయిన్లు భయపడుతూ పైకి చూస్తుండగా కనిపించారు. వీరితో పాటు మరికొందరు వ్యక్తులు కూడా ఆ దిశగా భయభ్రాంతులతో చూస్తున్నారు. అదే సమయంలో స్క్రీన్‌పై "ది రెబల్ వైబ్ టుమారో" అంటూ టీజర్ రిలీజ్ డేట్, టైమ్ చూపిస్తూ ఆసక్తిని పెంచారు. ఈ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Details

పెండింగ్ లో టెక్నికల్ పనులు

ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి కాగా, ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ప్రభాస్ ఇప్పటికే తన భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చివరి దశలో సౌండ్ రికార్డింగ్ సహా కొన్ని టెక్నికల్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టీజర్ విడుదలతో 'ది రాజాసాబ్' ప్రచారానికి మరింత ఊపు వచ్చేలా కనిపిస్తోంది.