Loading...
Irumudi: 'ఇరుముడి' ఎఫెక్ట్‌.. అయ్యప్ప మాల గెటప్‌లో డేవిడ్‌ వార్నర్‌!
'ఇరుముడి' ఎఫెక్ట్‌.. అయ్యప్ప మాల గెటప్‌లో డేవిడ్‌ వార్నర్‌!

Irumudi: 'ఇరుముడి' ఎఫెక్ట్‌.. అయ్యప్ప మాల గెటప్‌లో డేవిడ్‌ వార్నర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. సినిమా సాధించిన హైప్‌ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా 'ఇరుముడి'పై తనదైన రీతిలో స్పందించారు. అయ్యప్ప మాల ధరించినట్లు వార్నర్‌ను చూపిస్తూ రూపొందించిన ఓ ఫ్యాన్‌ ఎడిట్‌ ఫొటోను ఆయన స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రీపోస్ట్‌ చేయడంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలతో డేవిడ్‌ వార్నర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

వివరాలు

అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్

తెలుగు సినిమాలు, పాటలపై ఆయనకు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా 'ఆరెంజ్‌ ఆర్మీ ఫేవరెట్‌' అనే ఫ్యాన్‌ పేజ్‌ రూపొందించిన ఓ వినూత్నమైన డిజిటల్‌ ఆర్ట్‌ వార్నర్‌ దృష్టిని ఆకర్షించింది.

'ఇరుముడి'లో రవితేజ కనిపించిన అయ్యప్ప భక్తుడి గెటప్‌ను ఆధారంగా చేసుకుని.. అదే తరహాలో డేవిడ్‌ వార్నర్‌ను ఎడిట్‌ చేసి ఈ పోస్టర్‌ను రూపొందించారు.

భక్తిశ్రద్ధలు ఉట్టిపడేలా రూపొందించిన ఈ ఫ్యాన్‌ ఎడిట్‌ వార్నర్‌కు నచ్చడంతో దాన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు.

దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

వివరాలు

105 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో అరుదైన ఘనత

ఇక బాక్సాఫీస్‌ వద్ద 'ఇరుముడి' జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

విడుదలైన తొలిరోజు నుంచే యునానిమస్‌ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా.. 105 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించిందని చిత్రబృందం చెబుతోంది.

గత ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో సెకండ్‌ షోలు పూర్తిగా హౌస్‌ఫుల్‌ కావడం విశేషం. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు.

సాధారణంగా థియేటర్లకు వెళ్లడం తగ్గించిన ప్రేక్షకులు సైతం 'ఇరుముడి' కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారని చిత్రబృందం పేర్కొంటోంది.

ADVERTISEMENT

వివరాలు

మూడు రోజుల్లో రూ.72 కోట్లకు పైగా..

'ఇరుముడి' బాక్సాఫీస్‌ వసూళ్లు ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.72 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

గ్రాండ్‌ ఓపెనింగ్స్‌తో తొలి వీకెండ్‌లోనే రూ.80 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా సినిమా దూసుకెళ్తోంది.

పదేళ్లలో విడుదలైన పలు భారీ చిత్రాల రికార్డులను తిరగరాస్తూ.. కేవలం ఒకట్రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్‌ఈవెన్‌ పూర్తి చేసుకున్న ఏకైక చిత్రంగా 'ఇరుముడి' నిలిచిందని మేకర్స్‌ చెబుతున్నారు.

ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే ఓ గ్రాండ్‌ కంబ్యాక్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

శివ నిర్వాణ కథనం.. రవితేజ పాత్రకు ప్రశంసలు

దర్శకుడు శివ నిర్వాణ 'ఇరుముడి'లో రవితేజను లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ తండ్రి పాత్రలో అద్భుతంగా ఆవిష్కరించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు గ్రామంలో త్రినాథ్‌ రామగా రవితేజ కనిపిస్తారు. భార్య కావేరి, ముద్దుల కుమార్తె మణికంఠతో కలిసి ఆయన సాధారణ జీవితం సాగిస్తుంటారు.

కార్తీక మాసంలో నిష్టగా అయ్యప్ప మాల ధరించే త్రినాథ్‌ జీవితంలోకి ఓ సమస్య ప్రవేశిస్తుంది.

ఊరిలోని పాఠశాలలో చోటుచేసుకున్న ఓ విషాద సంఘటన, దాని తర్వాత పరిణామాలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయన్నదే సినిమా ప్రధాన కథాంశం.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథకు దైవిక అంశాలను జోడించి శివ నిర్వాణ సరికొత్త అనుభూతిని అందించారని ప్రేక్షకులు, చిత్రబృందం చెబుతున్నారు.

ADVERTISEMENT