LOADING...
Raja Saab : 'రాజా సాబ్' నుంచి మోస్ట్ అవైటెడ్ 'నాచే నాచే' సాంగ్ ప్రోమో విడుదల
'రాజా సాబ్' నుంచి మోస్ట్ అవైటెడ్ 'నాచే నాచే' సాంగ్ ప్రోమో విడుదల

Raja Saab : 'రాజా సాబ్' నుంచి మోస్ట్ అవైటెడ్ 'నాచే నాచే' సాంగ్ ప్రోమో విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల కాలంలో ప్రభాస్‌ను ఎక్కువగా సీరియస్ పాత్రల్లో చూసిన అభిమానులకు, ఈ చిత్రంతో వింటేజ్ ప్రభాస్, ఆయనలోని కామెడీ టైమింగ్, అలాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు మళ్లీ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'రెబల్ సాబ్', 'సహానా సహానా' పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, తాజాగా మోస్ట్ అవైటెడ్ ఐటమ్ సాంగ్ 'నాచే నాచే' ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Details

 హీరోయిన్లగా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్

బాలీవుడ్‌ ఐకానిక్ మూవీ 'డిస్కో డ్యాన్సర్'లోని సూపర్ హిట్ సాంగ్ 'నాచే నాచే'ను సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్, ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌లతో కలిసి స్టేజ్‌పై చేసిన సందడి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కలర్‌ఫుల్ సెట్స్‌, అదిరిపోయే కాస్ట్యూమ్స్‌, ప్రభాస్ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ స్టెప్పులు చూసే సరికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముగ్గురు భామల గ్లామర్‌, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Details

రాజా సాబ్ పై భారీ అంచనాలు

ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను జనవరి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని మాస్ ఎలిమెంట్స్, కామెడీ, కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో సమృద్ధిగా ఉండనున్నాయని సమాచారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'ది రాజా సాబ్', బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న సాంగ్

Advertisement