Loading...
The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!
ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!

The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల కలెక్షన్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.9,500 కోట్లకు పైమాటే. క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లో వన్ బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న మూడో చిత్రంగా 'ది ఒడిస్సీ' నిలిచింది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన 'ది డార్క్ నైట్' 1.008 బిలియన్ డాలర్లు, 'ది డార్క్ నైట్ రైజెస్' 1.08 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాయి. గతేడాది విడుదలైన 'ఓపెన్‌హైమర్' మాత్రం ఈ మార్క్‌కు కాస్త దూరంలోనే ఆగిపోయింది.

వివరాలు

నోలన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు..

అయితే ఈ వీకెండ్ ముగిసే సమయానికి 'ది ఒడిస్సీ' నోలన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు కేవలం ఐమాక్స్ స్క్రీన్ల నుంచే ఏకంగా 257 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.

అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,445 కోట్లు. దీంతో త్వరలోనే ఐమాక్స్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ది ఒడిస్సీ' రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సినీ మార్కెట్..

ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సినీ మార్కెట్ అయిన చైనాలో 'ది ఒడిస్సీ' ఇంకా విడుదల కావాల్సి ఉంది.

అక్కడ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

చైనా వ్యాప్తంగా దాదాపు 800 ఐమాక్స్ స్క్రీన్లతో పాటు వేలాది సాధారణ స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

చైనాలో విడుదల తర్వాత 'ది ఒడిస్సీ' కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT