The Paradise collections : బాక్సాఫీస్ వద్ద 'ది ప్యారడైజ్' జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే 'ది ప్యారడైజ్' విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగు రోజుల్లోనే రూ.155 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.
వివరాలు
కథానాయికగా కయాదు లోహర్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది.
మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ 'ది ప్యారడైజ్'కు సంగీతాన్ని అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ ఇదే
A blockbuster first weekend for #TheParadise ❤🔥❤🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) September 28, 2026
Collects 155 CRORES+ GROSS WORLDWIDE in 4 days 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdv
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@themohanbabu @11Lohar… pic.twitter.com/Ireg1EUAFk