LOADING...
The Raja Saab: ప్రభాస్ బర్త్​ డే స్పెషల్..'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ 
ప్రభాస్ బర్త్​ డే స్పెషల్..'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

The Raja Saab: ప్రభాస్ బర్త్​ డే స్పెషల్..'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు అక్టోబర్ 23 సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం వేడుకల్లో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాల నుంచి వరుసగా సర్‌ప్రైజ్ అప్డేట్లు వస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఉదయం "ఫౌజీ" చిత్రానికి సంబంధించిన స్పెషల్ హైలైట్స్ విడుదల కాగా, తాజాగా "రాజా సాబ్" మూవీ టీమ్ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ పోస్టర్‌తో పాటు మేకర్స్ "హ్యాపీ బర్త్‌డే రేబల్ సాబ్" అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలోనే చిత్రంలోని తొలి సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

రాబోయే సింగిల్ అప్డేట్‌పై సోషల్ మీడియాలో హంగామా

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రాజా సాబ్" సినిమా కామెడీ-హారర్ జానర్‌లో రూపొందుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ తెలిపిన ప్రకారం, ఈ చిత్రం 2026 జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ కొత్త పోస్టర్, రాబోయే సింగిల్ అప్డేట్‌పై అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్