
Ramayana:'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతేనా, నమిత్ మల్హోత్రా లాంటి అగ్ర నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ సినిమా 'రామాయణ' ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రూపొందుతుండగా, ఇందులో తొలి భాగం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో అమితాసక్తి రేపుతోంది. తాజాగా జులై 3న బెంగళూరులో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు రామ్-సీతలుగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు, దర్శకుడు నితేశ్ తివారీ తదితర బృందం హాజరుకానున్నారు.
Details
పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్!
కార్యక్రమానికి బయలుదేరుతున్న నటీనటుల వీడియోలు ఇప్పటికే ఎక్స్ (ట్విట్టర్) లో వైరల్ అయ్యాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా మొదటి భాగం పూర్తి అయ్యింది. షూటింగ్ ముగింపు సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన సెలబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో దర్శకుడు నితేశ్ తివారీ, హీరో రణ్‌బీర్ కపూర్ తాము ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతూ కనిపిస్తున్నారు. ఈ సినిమా 2026 దీపావళికి పార్ట్ వన్, 2027 దీపావళికి పార్ట్ టూగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపించనుండగా, సీత పాత్రలో సాయి పల్లవి అలరించనున్నారు.
Details
నా జీవితంలో ఇది గొప్ప అవకాశం : రణ్ బీర్ కపూర్
రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తన పాత్రకోసం రణ్‌బీర్ కపూర్ కొన్ని అలవాట్లను మార్చుకున్నారు. మాంసాహారం, మద్యం వంటి అలవాట్లకు విరామం ఇచ్చి పాత్రలోకి పూర్తిగా లీనమయ్యారని సమాచారం. రామాయణ వంటిది ఒక గొప్ప కథ. చిన్నప్పటి నుంచే వింటూ పెరిగాం. ఇది నా జీవితంలో ఒక గొప్ప అవకాశమని రణ్‌బీర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రముఖుల హంగు, అద్భుతమైన సాంకేతికత, గొప్ప విజన్‌తో తెరకెక్కుతున్న ఈ 'రామాయణ' ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. జులై 3న జరిగే ఈవెంట్ తర్వాత మరిన్ని అప్‌డేట్లు వెల్లువెత్తే అవకాశముంది.