NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!
    తదుపరి వార్తా కథనం
    Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!
    తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!

    Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 26, 2025
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు అనగానే సీనియర్‌ ఎన్టీఆర్‌ గుర్తొస్తారు.

    ఎందుకంటే హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి.

    ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ వరకు చాలా మంది హీరోలు దేవుళ్ల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

    మహాశివరాత్రి సందర్భంగా, వెండితెరపై శివుడి పాత్రను పోషించిన ప్రముఖ నటులు, సినిమాల గురించి తెలుసుకుందాం.

    సీనియర్ ఎన్టీఆర్

    లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) 1962లో విడుదలైన 'దక్షయజ్ఞం' చిత్రంలో శివుడిగా కనిపించారు.

    ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లో 100వ సినిమా కావడం విశేషం. అలాగే 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ'లోనూ ఆయన శివుడిగా నటించి అలరించారు.

    Details

    అక్కినేని నాగేశ్వరరావు

    అక్కినేని నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో శివుడిగా కనిపించకపోయినా, 'మూగ మనసులు'* (1964)లోని కొన్ని సన్నివేశాల్లో శివుడి వేషధారణలో కనిపించారు.

    కృష్ణంరాజు

    రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు 'శ్రీ వినాయక విజయం' సినిమాలో శివుడి పాత్రను పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

    శోభన్ బాబు

    సాంఘిక చిత్రాలకు పేరుగాంచిన శోభన్ బాబు 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాలో శివుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

    నందమూరి బాలకృష్ణ

    నటసింహం నందమూరి బాలకృష్ణ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామ కళ్యాణం'లోని ఓ పాటలో శివుడిగా కనిపించారు.

    Details

    మెగాస్టార్ చిరంజీవి 

    కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'శ్రీ మంజునాథ' (2001)లో చిరంజీవి శివుడి పాత్రలో కనిపించారు.

    తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంబరీష్, అర్జున్ సర్జా, సౌందర్య, మీనా తదితరులు నటించారు. అలాగే 'జగద్గురు ఆదిశంకర' (2013)లోనూ చిరంజీవి శివుడిగా నటించారు.

    అంతకుముందు 'పార్వతీ పరమేశ్వరులు', 'ఆపద్బంధవుడు' చిత్రాల్లోనూ కొన్ని సన్నివేశాల్లో శివుడిగా మెరిశారు.

    శివుడిగా కనిపించిన ఇతర నటులు

    అక్షయ్ కుమార్: మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో శివుడి పాత్ర పోషించారు. అంతకుముందు 'ఓ మై గాడ్ 2' (హిందీ)లోనూ శివుడిలా కనిపించారు.

    రవితేజ: 'చిరంజీవులు' చిత్రంలోని ఓ సరదా సన్నివేశంలో శివుడిగా దర్శనమిచ్చారు.

    జగపతిబాబు: 'పెళ్లైన కొత్తలో'* సినిమాలో ఓ పాటలో శివుడి వేషధారణలో కనిపించారు.

    Details

    ఢమరుకం సినిమాలో శివునిగా మెప్పించిన ప్రకాశ్ రాజ్

    సుమన్: 'శ్రీ సత్యనారాయణ స్వామి' సినిమాలో త్రినేత్రుడి పాత్ర పోషించారు.

    ప్రకాశ్ రాజ్: 'ఢమరుకం' (2012) సినిమాలో శివుడిగా కనిపించారు.

    తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు శివుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించగా, వీరిలో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు ప్రత్యేకంగా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    చిరంజీవి
    బాలకృష్ణ

    తాజా

    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్

    టాలీవుడ్

    Singer Chinmai: ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి స్పందన సినిమా
    COURT: నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ సినిమా
    Daku Maharaj: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి 'డాకు మహారాజ్' వచ్చేస్తోంది బాలకృష్ణ
    OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే! ఓటిటి

    చిరంజీవి

    Chiranjeevi:విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కసరత్తులు..సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న వీడియో  విశ్వంభర
    Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం  పద్మవిభూషణ్
    Chiranjeevi: విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్  సినిమా

    బాలకృష్ణ

    భగవంత్ కేసరి ప్రమోషన్స్ షురూ: పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి  సినిమా
    Bhagavanth Kesari : భగవత్ కేసరి నుండి 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ రిలీజ్ భగవంత్ కేసరి
    భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  సినిమా
    Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి'లో విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ భగవంత్ కేసరి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025