Loading...
Bhagyashri Borse about Unlucky tag: నన్ను అన్‌లక్కీ అన్నారు.. కానీ బాధపడలేదు: భాగ్యశ్రీ బోర్సే
నన్ను అన్‌లక్కీ అన్నారు.. కానీ బాధపడలేదు: భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse about Unlucky tag: నన్ను అన్‌లక్కీ అన్నారు.. కానీ బాధపడలేదు: భాగ్యశ్రీ బోర్సే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లెనిన్' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి 'భాగ్యశ్రీ బోర్సే' ఈ సక్సెస్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం, ఎదురైన విమర్శలు, కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విజయాన్ని చాలా కాలంగా ఎదురుచూశాను. నేను చేసిన కష్టానికి ఇదే ఫలితం. 'లెనిన్' సక్సెస్‌తో నాలో ఆసక్తి, ఉత్సాహం రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఒక్క రోజు కూడా వృథా చేయకూడదనిపిస్తోంది. విజయం ఇచ్చే ఆ చిన్న ప్రేరణ ప్రతి కళాకారుడికి ఎంతో అవసరమని భాగ్యశ్రీ తెలిపారు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. నా కుటుంబానికి నేను ఎప్పుడూ స్టార్‌నే.

వివరాలు

ఆ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి

చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద నటులతో కలిసి నటించడం చూసి వాళ్లు ఎంతో ఆనందించారు.

మేము థియేటర్లలో స్టార్ హీరోలను చూసి పెరిగిన వాళ్లం. ఒక రోజు వారితో కలిసి నటిస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.

సినిమాల విజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లపై తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆమె చెప్పారు.

''వాళ్లకు నేను తెరపై కనిపించడమే పెద్ద ఆనందం. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కొందరు నన్ను 'అన్‌లక్కీ' అని అన్నారు.

అయితే ఆ వ్యాఖ్యలు నన్ను బాధించలేదు. కానీ ఆశ్చర్యానికి గురి చేశాయని పేర్కొన్నారు.

వివరాలు

ఒక్కరినే బాధ్యుల్ని చేయడం సరైంది కాదు

అలాంటి పరిస్థితులను ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీమణులు కూడా ఎదుర్కొన్నారని భాగ్యశ్రీ గుర్తుచేశారు.

తాప్సీ పన్ను, శృతి హాసన్, శ్రీలీల వంటి హీరోయిన్లు కూడా తమ కెరీర్‌లో ఇలాంటి దశను చూశారు.

ఒక సినిమా విజయం సాధించకపోతే దానికి ఒక్కరినే బాధ్యుల్ని చేయడం సరైంది కాదు. సినిమా అనేది టీమ్‌వర్క్.

అందరి కృషి కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. రవితేజ హీరోగా తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే.. అనంతరం 'కింగ్‌డమ్', 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రాల్లో నటించారు.

తమిళంలో విడుదలైన 'కాంత' సినిమాతో కూడా ఆమె ప్రశంసలు అందుకున్నారు.

ADVERTISEMENT