
Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా 'టాక్సీవాలా' విడుదలకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుత ప్రాజెక్ట్ 'కింగ్డమ్' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, ఆ సినిమా విడుదలకి ముందుగా ఎదురైన సమస్యలు, తాను తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ 'టాక్సీవాలా' కథను వినిపించినప్పుడు నేను బాగా నవ్వుకున్నా. కథ వినగానే వెంటనే 'ఈ సినిమా చేద్దాం' అన్నాను.
చిత్రీకరణ సమయంలో ప్రతి సీన్ తర్వాత మానిటర్‌లో అవుట్‌పుట్ చూస్తే మళ్లీ నవ్వొచ్చేది.
అన్ని సన్నివేశాలు పూర్తి చేసి, ఎడిటింగ్ ముగించాక సినిమా విడుదలకు సిద్ధంగా ఉండే టైంలో, నేను చెన్నైలో 'నోటా' షూటింగ్‌లో ఉండగా నిర్మాతల నుంచి కాల్ వచ్చిందన్నారు.
Details
ఆ సమయంలో టెన్షన్ పెరిగింది
వాళ్ల గొంతులో తీవ్రమైన గంభీరత ఉండటంతో ఏదైనా సమస్య ఉందేమోనని టెన్షన్ వచ్చింది.
హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ గారిని కలిశా. అప్పటికి ఫైనల్ కట్ చూసిన నిర్మాతలు 'ఇది వర్కవుట్ కావడం లేదు, ఈ సినిమా విడుదలను ఆపేద్దాం.
తరువాతి సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేద్దామని చెప్పారు. నేను షాక్ అయ్యాను. మరోసారి ఆ కట్ చూద్దాం అని కోరాను. ఆ సారి చూసినప్పుడు నాకూ నవ్వు రాలేదు.
ఆ సమయంలో నేనొక విషయం గుర్తించాను, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా జానర్‌కు తక్కువగా అనిపించింది.
Details
సంగీత దర్శకుడి వల్లే హిట్
వెంటనే దర్శకుడు రాహుల్‌తో కలిసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకుందామని నిర్ణయించాం. మేము జేక్స్ బెజోయ్ అనే సంగీత దర్శకుడిని సంప్రదించాం.
అతడికి సినిమా నేపథ్యం వివరించాం. తర్వాత అతడు అందించిన నేపథ్య సంగీతం సినిమా మొత్తాన్ని మార్చేసింది. అదే 'టాక్సీవాలా' విజయం సాధించడానికి కీలకమైందని విజయ్ వెల్లడించారు.