
Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్‌డమ్'.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
మొదటిగా ఈ సినిమాను మే 30న విడుదల చేయాలని అనుకున్నారు.అయితే, తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం,ఈ చిత్రం జూలై 4వ తేదీకి వాయిదా పడింది.
వివరాలు
ప్రమోషన్లను,వేడుకలు ప్లాన్ చేయడం కష్టం
"మా అభిమాన ప్రేక్షకులకు తెలియజేయదలచుకున్న విషయం ఏమిటంటే, మే 30న విడుదల కావలసిన 'కింగ్‌డమ్' చిత్రం ఇప్పుడు జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. మే 30 తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో శ్రమించాం. కానీ, ఇటీవల మన దేశంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో,ప్రస్తుతం వాతావరణంలో ప్రమోషన్లను నిర్వహించడం,వేడుకలు ప్లాన్ చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది"అని చిత్ర బృందం పేర్కొంది.
వివరాలు
ఆసక్తికరమైన పాత్రలో భాగ్యశ్రీ బోర్సే
ఈ నిర్ణయం ద్వారా 'కింగ్‌డమ్' సినిమాకు మరింత నాణ్యతను జోడించి,ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభవం అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం.విడుదలలో కాస్త ఆలస్యమైనా,ఈచిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా,పూర్తిగా అద్భుతంగా ఉంటుందని మా నమ్మకం. జూలై 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతూ, మీ అందరి ప్రేమను పొందుతుందనే ఆశిస్తున్నాం. సినిమా విడుదల తేదీ మార్పు విషయంలో మాకు సహకరించిన దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని వెల్లడించారు.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన సినీ జీవితంలోనే అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ఆయన నటన,మేకోవర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయనకు జోడీగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు
#KINGDOM and its Arrival ‼️
— Sithara Entertainments (@SitharaEnts) May 14, 2025
JULY 04th, 2025 🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 #BhagyashriBorse @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @NeerajaKona @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @AdityaMusic pic.twitter.com/ASQbpCJUs9