NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్ 
    తదుపరి వార్తా కథనం
    సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్ 
    సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్

    సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 11, 2023
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి చావు బెదిరింపులు వచ్చాయి. నిన్నరాత్రి 9గంటలకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.

    రాకీ భాయ్ పేరుతో జోధ్ పూర్ నుండి సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని, ఏప్రిల్ 30వ తేదీన దబాంగ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరించారు.

    ప్రస్తుతం ఈ కాలర్ పై కేస్ నమోదైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. గతంలోనూ సల్మాన్ ఖాన్ కు ఇలాంటి బెదిరింపులే వచాయి. అప్పుడు ఈ-మెయిల్ రూపంలో వచ్చాయి. ఇప్పుడు కాల్ చేసి బెదిరించారు.

    తనకు వస్తున్న చావు బెదిరింపుల నేపథ్యంలో, బుల్లెట్ ప్రూఫ్ కారును కొన్నాడు సల్మాన్. నిస్సాన్ పాట్రోల్ SUVని కొనుక్కున్నాడు.

    Details

    ఇండియన్ మార్కెట్లో దొరకని నిస్సాన్ పాట్రోల్ SUV 

    నిస్సాన్ పాట్రోల్ SUV కారు ఇండియన్ మార్కెట్లోకి ఇంతవరకూ రాలేదు. ప్రత్యేకంగా తనకోసమే దిగుమతి చేయించుకున్నాడు సల్మాన్ ఖాన్.

    ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నుండి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమా వస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ని నిన్న సాయంత్రం ముంబైలో రిలీజ్ చేసారు. ట్రైలర్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, తదితరులు అందరూ పాల్గొన్నారు.

    కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా గురించి:

    తమిళ చిత్రమైన వీరమ్ సినిమాకు హిందీ రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. వీరమ్ సినిమాను తెలుగులో కాటమ రాయుడు గా రీమేక్ చేసారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    సినిమా

    బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట, బాలీవుడ్
    కార్తికేయ 3 పై సెన్సేషనల్ అప్డేట్: కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే అంటున్న నిఖిల్ తెలుగు సినిమా
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్ బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025