
సల్మాన్ ఖాన్ బాకీ తీర్చేసిన రామ్ చరణ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ క్యామియో పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి తార్ మార్ అనే పాటలో డాన్స్ కూడా వేసారు.
ఆ సినిమాలో నటించేందుకు సల్మాన్ ఖాన్ పారితోషికం కూడా తీసుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఐతే తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్ తళుక్కున మెరిసారు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే చిత్రంలోని ఏంటమ్మా అనే పాటలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసాడు రామ్ చరణ్.
ఏంటమ్మా అనే వీడియో సాంగ్ ఈరోజు రిలీజైంది. అటు సల్మాన్ ఖాన్, ఇటు విక్టరీ వెంకటేష్ మధ్యలో స్టెప్పులు వేసాడు రామ్ చరణ్.
సల్మాన్ ఖాన్
తెలుగు ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నం
ప్రస్తుతం, ఏంటమ్మా అనే పూర్తి వీడియో సాంగ్, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఆ పాటలో రామ్ చరణ్ సడెన్ గా ప్రత్యక్షమవడంతో, ఆ వీడియో సాంగ్ వైరల్ అవుతోంది.
సగం తెలుగు లిరిక్స్, సగం హిందీ లిరిక్స్ తో కూడిన ఈ పాటను చూస్తుంటే, తెలుగు ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండవచ్చని అనిపిస్తోంది.
అందుకె తెలుగు మార్కెట్ ను ఆకర్షించడానికి రామ్ చరణ్ ను తీసుకొచ్చారేమోనని సోషల్ మీడీయాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో, విక్టరీ వెంకటేష్, భూమికా చావ్లా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.