బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట,
బతుకమ్మ.. తెలంగాణ రాష్ట్ర పండగ. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండగ ప్రపంచ నలుమూలలకు పరిచయమైంది. బతుకమ్మ పండగ పాటలకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో మన సినిమాల్లో బతుకమ్మ పండగ, తెలంగాణ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాలోనూ బతుకమ్మ పాట కనిపించింది. కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ చిత్రంలోంచి తాజాగా బతుకమ్మ పాటను రిలీజ్ చేసారు. ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలే కట్టేద్దామా అంటూ మొదలయ్యే ఈ బతుకమ్మ పాట, ఆద్యంతం ఆసక్తిగా ఉంది. 2నిమిషాల నిడివి గల ఈ పాట, దాదాపు పూర్తిగా తెలుగులో ఉంది.
సాంప్రదాయ దుస్తులో మెరిసిన సల్మాన్ ఖాన్
ఈ బతుకమ్మ పాటలో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ అచ్చమైన సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు. పూజా హెగ్డే, భూమికా చావ్లా, బతుకమ్మలను తయారు చేస్తూ, ఆడుతూ పాడుతూ అందంగా కనిపించారు. ఈ పాటకు సంగీతాన్ని రవి బస్రూర్ అందించగా, సంతోష్ వెంకో, ఐరా ఉడిపి, హరిణి ఇవటూరి, సుచేతా బస్రూర్, విజయలక్ష్మి మెట్టినహోల్ సంయుక్తంగా ఆలపించారు. తెలుగు సాహిత్యాన్ని కిన్నాల్ రాజ్, హరిణి ఇవటూరి రచించగా, హిందీ లిరిక్స్ ని షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాసారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ నిర్మించారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతుంది.