Page Loader
వేటకు సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా
ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా

వేటకు సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 27, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరావు సినిమాపై మేజర్‌ అప్‌డేట్‌ను చిత్ర బృందం అందించింది. ఈ మేరకు మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయనున్నామని ప్రకటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మాస్ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరగనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాలో రేణుదేశాయ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు ఇద్దరూ హీరోయిన్‌లుగా నటించారు. మరోవైపు ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో, ఇటు అభిమానుల్లో అంచనాలు మాములుగా లేవు. గతంలో గ్లింప్స్ రిలీజై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇండియ‌న్ రాబిన్ హుడ్‌గా గుర్తింపు పొందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అక్టోబర్ 3న విడుదల కానున్న ట్రైలర్