
రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
రావణాసుర తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రవితేజ వచ్చేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా నుండి ఇప్పటివరకు ఏక్ దమ్ అనే పాటను రిలీజ్ చేశారు.ప్రస్తుతం మరొక పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఆకట్టుకునే పోస్టర్ ని వదిలారు.
'వీడు' అనే సెకండ్ సింగిల్ ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్టు ఈ పోస్టర్ లో ప్రకటించారు. పోస్టర్ చూస్తుంటే టైగర్ నాగేశ్వరరావు పాత్ర ఎలివేషన్ సాంగ్ లాగా అనిపిస్తుంది.
నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
Brace yourselves to witness MASSY SIDE of #TigerNageswaraRao 🥷🔥
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 18, 2023
2nd Single #Veedu #Bheedu #Ivanu #Ivan out on Sept 21st ❤🔥
A @gvprakash musical 🥁@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher @NupurSanon #RenuDesai @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/IKwQMRZvbB