Toxic: ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాక్సిక్'.. 'ధురంధర్ 2' రికార్డు బద్దలు కొట్టిన యశ్ మూవీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో వాయిదాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రీసేల్ బుకింగ్స్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 'టాక్సిక్' టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
వివరాలు
'ధురంధర్ 2'ను బీట్ చేసిన 'టాక్సిక్'..
ప్రీసేల్ బుకింగ్స్‌లో 'టాక్సిక్' దూకుడు చూపించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ధురంధర్ 2' రికార్డును ఈ సినిమా అధిగమించింది.
'ధురంధర్ 2' ప్రీసేల్‌లో 14 లక్షల టికెట్లు అమ్ముడవగా.. 'టాక్సిక్' ఏకంగా 16 లక్షల టికెట్లను విక్రయించింది.
ఈ భారీ ఓపెనింగ్స్‌ను చూస్తుంటే.. సినిమా తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
దయచేసి సన్నివేశాలను రికార్డ్ చేయొద్దు..
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' విడుదల సందర్భంగా ఆగస్టు 25న రాత్రి చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది.
''ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఎంతోమంది సాంకేతిక నిపుణులు, నటీనటులు, సిబ్బంది ఎన్నో ఏళ్లుగా ప్రేమతో, ఎంతో కష్టపడి రూపొందించిన ప్రపంచం.
ఈ చిత్రాన్ని థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై అందరితో కలిసి ఆస్వాదించాలని మేం కోరుకుంటున్నాం.
థియేటర్లలో సినిమా చూస్తున్న సమయంలో సన్నివేశాలను మీ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు.
సినిమా కథ, ట్విస్టులను ఇతరులకు వెల్లడించవద్దు'' అని 'టాక్సిక్' టీమ్ ప్రేక్షకులను కోరింది.