Loading...
Toxic Movie: 'టాక్సిక్'పై నిర్మాత క్లారిటీ.. ఇది పెద్దల కోసం రూపొందించిన చిత్రం
'టాక్సిక్'పై నిర్మాత క్లారిటీ.. ఇది పెద్దల కోసం రూపొందించిన చిత్రం

Toxic Movie: 'టాక్సిక్'పై నిర్మాత క్లారిటీ.. ఇది పెద్దల కోసం రూపొందించిన చిత్రం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'టాక్సిక్'. దీనికి 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' అనే ఉపశీర్షికను ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇందులో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కె. నారాయణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పందించారు. 'టాక్సిక్' సాధారణ చిత్రాల మాదిరిగా ఉండదని, కథా నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

పెద్దల కోసం రూపొందించిన కల్పిత కథ..

నారాయణ మాట్లాడుతూ.. "'టాక్సిక్' మా సంస్థకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

ఇప్పటివరకు మేం నిర్మించిన సినిమాలన్నింటికంటే ఇది భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కొత్త అనుభూతిని పొందుతారు.

మంచి చిత్రాన్ని అందించారంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటామనే నమ్మకం ఉంది.

అలాగే, ఇది పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన కల్పిత కథ" అని తెలిపారు.

వివరాలు

ట్రెండింగ్‌లో సాంగ్..

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన 'మనసాగదే..' పాట ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

యశ్, తారా సుతారియా మధ్య చిత్రీకరించిన ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా తారా సుతారియా కూడా స్పందిస్తూ, పాటలోని కొన్ని సన్నివేశాలను ఎంతో అందంగా తెరకెక్కించారని ప్రశంసించారు.

ఈ చిత్రంలో యశ్‌తో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

ADVERTISEMENT