LOADING...
AR Rahman: రెండు ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి : ఏఆర్ రెహమాన్
రెండు ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి : ఏఆర్ రెహమాన్

AR Rahman: రెండు ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి : ఏఆర్ రెహమాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల దేశంలో జరుగుతున్న సామాజిక, మతపరమైన చర్చల నడుమ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న అనుభవం తనకు గౌరవంతో పాటు భారంగా కూడా మారిందని రెహ్మాన్ వ్యాఖ్యానించారు. ఈ పురస్కారాలు తనపై నిరంతర ఒత్తిడిని, మళ్లీ మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయని ఆయన వెల్లడించారు.

Details

ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి: ఏ.ఆర్. రెహ్మాన్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహ్మాన్ తన అంతర్మథనాన్ని స్పష్టంగా వివరించారు. 'గత ఆరు సంవత్సరాలుగా, నిజం చెప్పాలంటే, నన్ను కలిసే చాలామంది నా గత సంగీతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతుంటారు. 90వ దశకంలో పుట్టినవాళ్లకు ఆ కాలం పాటలపై ప్రత్యేకమైన నోస్టాల్జియా ఉంటుంది. 2000 తర్వాతి తరాలకూ అలాంటి అనుబంధమే ఉంది. వాళ్లు వచ్చి 'సార్... మీరు 90లలో చేసిన 'రోజా' ఎంత అద్భుతమైన సంగీతమో!' అని చెబుతారు. అలా చెప్పడం అంటే... ఇప్పుడున్న నా సంగీతం అంత బాగోలేదన్న భావనను పరోక్షంగా కలిగించినట్లే. మనసు బలంగా లేని సమయంలో ఇవన్నీ ఆలోచనలను దెబ్బతీస్తాయని అన్నారు.

Details

గత విజయాల మీద ఆధారపడకూడదు

అవార్డుల వల్ల వచ్చే ఒత్తిడి తన ఆత్మవిశ్వాసాన్ని సవాల్ చేస్తుందని కూడా రెహ్మాన్ పేర్కొన్నారు. 'ఆ మాటలన్నింటినీ నేను ప్రేమతోనే స్వీకరిస్తాను. కానీ నా లోపల మాత్రం మళ్లీ నా స్వాభిమానాన్ని, నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు నేను చేయబోయేది నా బెస్ట్ వర్క్ అవ్వాలి. గత విజయాల మీద ఆధారపడకూడదు. 'నాకు రెండు ఆస్కార్‌లు వచ్చాయి' అని అనుకోవడం మనల్ని అలసటకు గురిచేస్తుంది. అది సృజనాత్మకతకు అడ్డుగా మారుతుంది. చేయాలనే ప్రేరణను కూడా తగ్గిస్తుంది. అవార్డులు కొన్నిసార్లు భారంగా మారతాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Details

నాకు ప్రతి రోజు ఒక కొత్త ఆరంభమే

తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో కూడా అవార్డుల ప్రస్తావన ఉండదని ఆయన స్పష్టం చేశారు. నా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ బయోల్లో ఆస్కార్‌లు లేవు, గ్రామీ అవార్డులూ లేవు. నాకు ప్రతి రోజు ఒక కొత్త ఆరంభమే. 2026 ఒక ఫ్రెష్ స్టార్ట్ అని రెహ్మాన్ తెలిపారు. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన తర్వాత కూడా తనలోని కళాకారుడిని ప్రతిరోజూ కొత్తగా నిరూపించుకోవాలనే తపన ఉందని రెహ్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement