
'పుష్ప 2' షూటింగ్ కోసం వైజాగ్‌కు అల్లు అర్జున్.. అభిమానుల ఘనస్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప-1' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలో సుకుమార్, అల్లు అర్జున్ 'పుష్ప-2'ను తెరకెక్కించే పనిలో నిగమ్నమయ్యారు.
ఆదివారం పుష్ప-2 షూటింగ్‌ను పునఃప్రారంభించడానికి అల్లు అర్జున్ వైజాగ్‌కు చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ స్వాగతం పలికిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆగస్ట్ 15, 2024న 'పుష్ప-2'ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ మూవీలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైజాగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి
India's Biggest Brand In VIZAG! 💥✊@alluarjun #VizagGaddaAlluArjunAdda pic.twitter.com/pvhdjwTASE
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 10, 2024