అన్ స్టాపబుల్: ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్
టాక్ షోలన్నింటిలోకి టాక్ ఆఫ్ ద టాక్ షో నిలిచినగా అన్ స్టాపబుల్, ఆగకుండా దూసుకుపోతూనే ఉంది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన బాలయ్య, రెండవ సీజన్ ని అంతకంటే ఎక్కువ సక్సెస్ లోకి తీసుకెళ్ళారు. ప్రభాస్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ స్థానం ఆకాశాన్నంటింది. ఇప్పుడు అక్కడి నుండి మరింత ముందుకు వెళ్ళేందుకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని సిద్ధం చేసారు. అప్పుడెప్పుడో పవన్ వస్తున్నాడని ప్రకటించిన ఆహా, అభిమానులను ఊరించి ఊరించి, దాదాపు నెల తర్వాత పవన్ ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే ప్రోమూను రిలీజ్ చేసారు. ఎపిసోడ్ కూడా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల అవుతుందని ఆహా వెల్లడి చేసింది.
ఒకరోజు ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్
ఫిబ్రవరి 3వ తేదీ కోసం పవన్ ఫ్యాన్స్ సిద్ధమైపోయారు. కానీ సడెన్ గా ఆహా టీమ్ పవన్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఒకరోజు ముందుగానే పవన్ ఎపిసోడ్ ని ఆహాలో అందుబాటులో ఉంచుతున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 9గంటలకు పవన్ ఎపిసోడ్ రిలీజ్ అవనుంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఆహాకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొదటి భాగం ప్రోమోలో చూపించిన దాని ప్రకారం, ఈ ఎపిసోడ్ లో సినిమా, కుటుంబ అంశాలు మాత్రమే ఉండనున్నట్లు అర్థం అవుతోంది. రాజకీయ అంశాలు రెండవ భాగంలో ఉంటాయని తెలుస్తోంది. మరి రెండవ భాగం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.