
Upasana Konidela: రామ్ చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
ఈ వార్తాకథనం ఏంటి
ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీలక విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్ తన బెస్ట్ థెరపిస్ట్ అని తెలిపారు.
ప్రసవానంతర డిప్రెషన్ ను అధిగమించడానికి రామ్ చరణ్ ఎంతో సహాయం చేసినట్లు.. డెలివరీ తర్వాత తాను ఎదుర్కున్న సవాళ్ళను వివరించారు.
"చాలా మందిలాగే నేనూ డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు చరణ్ నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు మా పుట్టింటికి వచ్చాడు. అందరికి ఇలాంటి అదృష్టం ఉండదు"అని చెప్పారు.
Details
ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్
తమ కూతురు క్లీంకార విషయంలోనూ చరణ్ చాలా శ్రద్ద చూపిస్తాడని తెలిపింది.
అసలు రామ్ చరణ్ క్లీంకారని చూసుకునే విధానం చూస్తే.. చాలా ముచ్చటేస్తుంది అని తెలిపారు.
అలాగే క్లీంకార చాలా విషయాల్లో అచ్చం చరణ్ లానే ఉంటుంది. ఇక ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లానే ఉంటాయి' అంటూ చెప్తూ ఉపాసన మురిసిపోయారు.
ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.