
సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సందడి చేశాయి. అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.
ఇవే కాదు అనువాద చిత్రమైన వారసుడు, యూవీ కాన్సెప్ట్ బ్యానర్లో రిలీజైన కళ్యాణం కమనీయం సంక్రాంతికి సందడి చేశాయి.
థియేటర్ల వద్ద ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, వీటిని థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాలన్నీ ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ముందుగా కళ్యాణం కమనీయం.
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈరోజు నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఓటీటీ
కీర్తి సురేష్, యాక్టర్ సుహాస్ నటించిన చిత్రాలు ఓటీటీలోకి
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఫిబ్రవరి 23వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది. ఇక సంక్రాంతి విన్నర్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య ఫిబ్రవరి 27వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
యాక్టర్ సుహాస్, బిందు మాధవి, తరుణ్ భాస్కర్, మడోన్నా సెభాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాంగర్ టేల్స్ సిరీస్ మార్చ్ 9వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కోపం వల్ల తమ జీవితంలో సంఘటనలు ఎలా మారాయో ఈ సిరీస్ లో చూపెడుతున్నారు.
ఇవే కాక కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.