LOADING...
Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?
Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?

Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డులపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా ప్రముఖ నటి ఊర్వశి, తనకు,ఇతరులకు లభించిన పురస్కారాలను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది నటి ఊర్వశికి 'ఉళ్ళోజుక్కు'అనే మలయాళ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి (బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్)విభాగంలో జాతీయ అవార్డు లభించింది. అయితే,ఊర్వశి తాజాగా ఇచ్చిన ఓ మలయాళ ఇంటర్వ్యూలో ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.."నాకు ఉత్తమ సహాయ నటి అవార్డు ఎలా ఇచ్చారు?జ్యూరీ సభ్యులు నటనను ఏ ప్రమాణాలతో అంచనా వేశారు? నేను సహాయ పాత్ర చేశానా? అవార్డు అంటే మీరు ఇవ్వగానే తీసుకోడానికి అదేమీ పెన్షన్ కాదు అంటూ ఘాటుగా స్పందించారు.

వివరాలు 

అతనికి ఉత్తమ నటుడి  ఇవ్వాలి కదా..

అంతేకాదు, ఆమె షారుక్ ఖాన్‌ను ఉత్తమ నటుడిగా ప్రకటించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. "షారుఖ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎలా ఇచ్చారు?ఏ ప్రమాణాల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నారు?"అని ఆమె ప్రశ్నించారు. అలాగే 'పూక్కళమ్'అనే చిత్రానికి విజయరాఘవన్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డును ప్రకటించడంపైనా ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. "అతను సహాయ పాత్ర చేశాడా?అతనికి ఉత్తమ నటుడి ఇవ్వాలి కదా.. నిజానికి ఆ సినిమాలో నాకు కూడా అవకాశం వచ్చింది. అయితే ఆ పాత్ర కాస్త కష్టంగా అనిపించింది కాబట్టి నేను ఒప్పుకోలేదు.కానీ ఆయన అంగీకరించి నటించారు. ఇది 250 కోట్లు కొల్లగొట్టిన పెద్ద సినిమా కాదు.పెద్ద హిట్ కాలేదు.అప్పుడు జ్యూరీ ఈ అంశాల్ని ఎలా పరిగణలోకి తీసుకుంది?" అంటూ నిలదీశారు.

వివరాలు 

షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడి  అవార్డుపై పరిశ్రమవర్గాలు ఆశ్చర్యం

షారుఖ్ ఖాన్ విషయంలో, గతంలో ఆయన చేసిన ఎన్నో నాణ్యమైన పాత్రలకు అవార్డు రాకపోవడమే కాక, ఆయనకు ఈసారి 'జవాన్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించడంపై అభిమానులు, పరిశ్రమవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఊర్వశి చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. అసలు మూవీ యూనిట్ ఏ కేటగిరిలో అప్లై చేస్తే వాళ్ళు ఆ కేటగిరీలోనే చూస్తారు కదా, మూవీ యూనిట్ బెస్ట్ కేటగిరిలోనే అప్లై చేసారా? సపోర్టింగ్ కేటగిరిలో ఇచ్చారా? మీ మూవీ యూనిట్ ని అడిగారా? సపోర్టింగ్ పాత్ర చేసి మెయిన్ లీడ్స్ లో ఎలా అడుగుతారు అని ఆమెని ప్రశ్నిస్తున్నారు. మరి ఊర్వశి ఆ అవార్డు తీసుకోడానికి వెళ్తుందా లేదా చూడాలి.