LOADING...
Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్'..'తేరి' - రీమేక్‌ రూమర్స్‌కు ఎండ్!
'ఉస్తాద్ భగత్ సింగ్'..'తేరి'- రీమేక్‌ రూమర్స్‌కు ఎండ్!

Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్'..'తేరి' - రీమేక్‌ రూమర్స్‌కు ఎండ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నా, ఆయన కమిట్ చేసిన చిత్రాల పనిని కూడా అదే వేగంతో పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది, చిత్రబృందం ఏప్రిల్‌లో గ్రాండ్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తోంది. సినిమా ప్రకటించిన రోజునుంచీ ఇది తమిళ హీరో విజయ్ సూపర్‌హిట్ 'తేరి'కి రీమేక్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నా, ఇదే విషయంపై హరీష్ శంకర్ ఎప్పుడూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మేకర్స్ మాత్రం ప్రారంభం నుంచి "ఇది రీమేక్ ఫీల్ రాకుండా పూర్తిగా కొత్త గా ఉంటుంది" అని చెబుతూనే ఉన్నారు.

వివరాలు 

రీమేక్‌లో హరీష్ శంకర్‌కు మంచి పేరు

తాజా సమాచారం ప్రకారం,'తేరి'లోని ప్రధాన కాన్సెప్ట్ మాత్రమే తీసుకొని,మిగిలిన కథ,సీన్లు, పాత్రల తీరు అన్నింటినీ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు, తెలుగు నేటివిటీకి సరిపోయేలా పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది. రీమేక్‌లను తనదైన స్టైల్‌లో మార్చి కొత్తగా చూపడంలో హరీష్ శంకర్‌కు మంచి పేరు ఉన్నందున, ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ, "ఈ కథలో అద్భుతమైన కంటెంట్ ఉంది. పవర్ స్టార్ ఇమేజ్‌కు ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. రీమేక్ అనిపించే అవకాశం లేదు. ఫుల్ మాస్, ఫుల్ ఎనర్జీతో సినిమా రాబోతోంది" అంటూ స్పష్టత ఇచ్చాడు.

వివరాలు 

 పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో  'గబ్బర్ సింగ్' 

నిర్మాత వ్యాఖ్యలతో సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగిపోయింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందుకే 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా భారీ సక్సెస్ సాధిస్తుందనే ఆశలు విపరీతంగా పెరిగాయి.