తదుపరి వార్తా కథనం
Varanasi: వారణాసి సినిమా నుంచి 'రణ కుంభ' ఆడియో సాంగ్ రిలీజ్!
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 19, 2025
11:41 am
ఈ వార్తాకథనం ఏంటి
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబుమహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ కథలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) "కుంభ" అనే కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తూ ఒక పాట రూపంలో ప్రదర్శించారు. ఇప్పుడు అదే పాటకు సంబంధించిన ఆడియోను అధికారికంగా విడుదల చేశారు. "ప్రళయం ప్రళయం" అనే పలుకులతో ముందుకు సాగే ఈ "రణ కుంభ" సాంగ్‌ను మీరు కూడా వినేయండి .