LOADING...
Varun tej-Lavanya Tripathi: కొడుకు పేరు వెల్లడించిన వరుణ్ తేజ్‌ దంపతులు
కొడుకు పేరు వెల్లడించిన వరుణ్ తేజ్‌ దంపతులు

Varun tej-Lavanya Tripathi: కొడుకు పేరు వెల్లడించిన వరుణ్ తేజ్‌ దంపతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు వరుణ్‌ తేజ్‌,లావణ్య త్రిపాఠిలకు సెప్టెంబర్‌ 10న బాబు పుట్టిన విషయం తెలిసిందే తాజాగా ఆ శిశువుకు బారసాల వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. ఇదే సందర్భంలో దసరా పండుగ రోజున తన కుమారుడి పేరును వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తన బిడ్డకు 'వాయువ్‌ తేజ్‌ కొణిదెల' (Vaayuv Tej Konidela) అని పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ, ''ఆంజనేయస్వామి కృపతో జన్మించిన మా బాబుకు ఈ పేరు పెట్టాము. మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అతనిపై ఉండాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. అదే సమయంలో బారసాల వేడుకకు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

వివరాలు 

'మిస్టర్‌' సినిమాలో తొలిసారి జంటగా

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల ప్రేమకథ కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. 2017లో వచ్చిన 'మిస్టర్‌' సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా గాఢమైన స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. చివరకు 2023 నవంబర్‌ 1న ఇటలీలోని అందమైన నగరం టస్కానీ లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరుణ్‌ తేజ్‌ చేసిన ట్వీట్