NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు 
    తదుపరి వార్తా కథనం
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు 
    జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 08, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా హీరో వరుణ్ తేజ్, అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అందాల రాక్షసితో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్ళి జరగనుంది. ఆల్రెడీ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

    హైదరాబాద్ లో జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరగనుందని అధికారికంగా సమాచారం వచ్చింది.

    ఈ నిశ్చితార్థ వేడుకకు, మెగా కుటుంబ హీరోలందరూ, అలాగే సినీ ప్రముఖులు హాజరు కానున్నారని వినిపిస్తోంది. పెళ్ళి మాత్రం ఈ సంవత్సరం చివర్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాల్లో నటించారు.

    Details

    వరుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు 

    మొదటి సినిమా మిస్టర్ తో వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ తర్వాత అంతరిక్షం సినిమా సమయంలో అది ప్రేమగా మారిందని చెబుతున్నారు.

    అదలా ఉంచితే, వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    అలాగే శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగులు పూర్తయ్యాక, పెళ్ళి వేడుక ఉండనుందట.

    నవంబర్ లోగా సినిమాలను పూర్తి చేసి పెళ్ళికి సిద్ధమవ్వాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ పై అధికారిక ట్వీట్ 

    The moment we've been waiting for has arrived🤗❤️

    It’s official🕺🏻💃

    Hearty congratulations to
    𝑴𝒆𝒈𝒂 𝑷𝒓𝒊𝒏𝒄𝒆 @IAmVarunTej & @Itslavanya on getting Engaged on 9th June, 2023 🤩🥳

    Wishing a lifetime of happiness together✨#VarunTejKonidela #VarunTej #LavanyaTripathi pic.twitter.com/jkcge86JnG

    — SivaCherry (@sivacherry9) June 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరుణ్ తేజ్
    తెలుగు సినిమా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్

    తెలుగు సినిమా

    అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్  సినిమా రిలీజ్
    మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు  మహేష్ బాబు
    మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లోని ఆసక్తికర తెలియని విషయాలు  పుట్టినరోజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025