NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రానా నాయుడు నెగెటివిటీపై మొదటిసారిగా స్పందించిన వెంకటేష్ 
    తదుపరి వార్తా కథనం
    రానా నాయుడు నెగెటివిటీపై మొదటిసారిగా స్పందించిన వెంకటేష్ 
    రానా నాయుడు నెగెటివిటీపై రెస్పాండ్ అయిన వెంకటేష్

    రానా నాయుడు నెగెటివిటీపై మొదటిసారిగా స్పందించిన వెంకటేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడుపై విపరీతమైన నెగెటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

    ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే వెంకటేష్ ని రానా నాయుడులో చూసి అభిమానులంతా షాకయ్యారు.

    శృతిమించిన పదజాలం, శృతి మించిన శృంగార సన్నివేశాల కారణంగా రానా నాయుడు సిరీస్ పై నెగెటివ్ రివూస్ వచ్చాయి. ఈ నెగెటివిటీపై మొదటిసారిగా విక్టరీ వెంకటేష్ స్పందించారు.

    రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న అహింస ప్రెస్ మీట్ లో పాల్గొన్న వెంకటేష్ ను రానా నాయుడు నెగెటివిటీపై ప్రశ్న అడిగారు.

    ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడ్డం సరైనది కాదని దాటవేసేందుకు ప్రయత్నం చేసాడు వెంకటేష్.

    Details

    అందరికి నచ్చేలా రానా నాయుడు సీజన్ 2 

    రానా నాయుడు నెగెటివిటీపై స్పందించేందుకు మొదట ఆసక్తి చూపని వెంకటేష్, ఆ తర్వాత సదరు జర్నలిస్టు మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో, గతం గురించి ఆలోచించడం కంటే భవిష్యత్తులో ఏం చేయాలనేదే ఇంపార్టెంట్ అని, రానా నాయుడు నెగెటివిటీ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదని అన్నారు.

    అంతేకాదు, రానా నాయుడు సిరీస్ కొందరికి నచ్చలేదని కానీ రానా నాయుడు నెక్స్ట్ సీజన్ ని అందరికీ నచ్చేలా తీయడానికి ట్రై చేస్తామని చెప్పుకొచ్చారు.

    నెట్ ఫ్లిక్స్ మాత్రం రానా నాయుడు సిరీస్ తో హ్యాపీగా ఉందని వెల్లడి చేసారు.

    అదలా ఉంచితే, వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో చేస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    వెంకటేష్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్  రవితేజ
    రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్  రామ్ చరణ్
    తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా?  సినిమా
    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు  ఓటిటి

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025