తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా?
ఈ వార్తాకథనం ఏంటి
రానా దగ్గుబాటి సోలోగా హిట్టు కొట్టి చాలా రోజులు ఐపోయింది. హీరోగా సాలిడ్ హిట్ కోసం రానా ఎదురుచూస్తున్నాడు. రానా హీరోగా మంచి సినిమా రావాలని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
అభిమానుల ఎదురుచూపులు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోగా రానా కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడని సమాచారం అందుతోంది. అది కూడా తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది.
ఈ సినిమాకు ఆచంట గోపీనాథ్ నిర్మాతగా ఉంటారని అంటున్నారు.
రానా, తేజ కాంబినేషన్ లో గతంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చింది. 2017లో రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళను సాధించింది. కాజల్ అగర్వాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.
Details
అహింస సినిమాతో రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ
ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కనుందని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అహింస సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు తేజ.
రానా తమ్ముడు అభిరామ్, అహింస సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతికా తివారీ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించాడు.
ఆనంది ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా, జూన్ 2వ తేదీన విడుదల అవుతుంది.
అదలా ఉంచితే, ఇటీవల రానా నాయుడు సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సిరీస్ కు మిశ్రమ స్పందన వచ్చింది. రానా నాయుడు రెండవ సీజన్ త్వరలో వస్తుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.