NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ 
    తదుపరి వార్తా కథనం
    రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ 
    రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది

    రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 19, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సిరీస్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

    ఈ సిరీస్ లో బూతులు మరీ శృతిమించి పోయాయని నెటిజన్లు కామెంట్లు చేసారు. విక్టరీ వెంకటేష్ బూతులు మాట్లాడ్డం నచ్చలేదని మరికొందరు అన్నారు.

    రానా నాయుడుకు వచ్చిన నెగెటివ్ కామెంట్ల నేపథ్యంలో ఈ సిరీస్ కు రెండవ సీజన్ ఉండదేమోనని అందరూ అనుకున్నారు.

    కానీ అందరికీ షాకిస్తూ రానా నాయుడు రెండవ సీజన్ ని ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈరోజు ఈ విషయమై అప్డేట్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తుందని ఒక చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసింది.

    Details

    టీవీ సిరీస్ ఆధారంగా రూపొందిన రానా నాయుడు 

    తండ్రీ కొడుకుల మధ్య సాగే వైరుధ్యాలను రానా నాయుడు సిరీస్ లో చూపించారు. 2013లో వచ్చిన టీవీ సిరీస్ రే దోనోవన్ ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు.

    యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కు, బీవీఎస్ రవి స్క్రీన్ ప్లే అందించారు. బాలీవుడ్ దర్శకులైన సూపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ తెరకెక్కించారు.

    సుచిత్ర పిళ్ళై, గౌరవ్ చోప్రా కీలక పాత్రల్లో కనిపించారు. ఐతే ఈ సిరీస్ రెండవ సీజన్ ని తీసుకొస్తున్నామని నెట్ ఫ్లిక్స్ తెలియజేసింది గానీ ఎప్పుడు తీసుకొస్తున్నారనేది వెల్లడి చేయలేదు.

    బూతుల విషయంలో మొదటి సిరీస్ కు విపరీతమైన నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. మరి ఈసారి బూతుల డోస్ తగ్గిస్తారా లేదా అనేది చూడాలి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది

    Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH

    — Netflix India (@NetflixIndia) April 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    వెంకటేష్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఓటిటి

    ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో కనబడని ఇద్దరు జడ్జిలు సినిమా
    ఈ వారంలో ఓటీటీ లేదా థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు సినిమా రిలీజ్
    అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్ రామ్ చరణ్
    సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు వాల్తేరు వీరయ్య

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025