Loading...
Venky Anil5: 'వెంకీ అనిల్5' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
'వెంకీ అనిల్5' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

Venky Anil5: 'వెంకీ అనిల్5' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వెంకీ అనిల్5' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమా మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం.. "స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేసింది. తొలి షెడ్యూల్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. అనిల్ రావిపూడి మార్క్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన ఎపిసోడ్‌లను అద్భుతంగా తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు.

వివరాలు 

వెంకీ-అనిల్ కాంబోపై భారీ అంచనాలు

టాలీవుడ్‌లో వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

గతంలో వీరి కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో.. ఇప్పుడు రూపొందుతున్న 'వెంకీ అనిల్5'పై కూడా అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరో హీరోగా కళ్యాణ్ రామ్

ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో మరో హీరోగా నటిస్తున్నాడు. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేశ్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వివరాలు 

ప్రతిష్ఠాత్మక నిర్మాణం.. సంక్రాంతికి విడుదల

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

'సురేష్ ప్రొడక్షన్స్' 'జీ స్టూడియోస్' ఈ ప్రాజెక్ట్‌కు సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వెంకటేష్-అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైర‌లవుతున్న వీడియో

ADVERTISEMENT