
Sapthagiri : ప్రముఖ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హాస్య నటుడు, హీరో సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, అతని తల్లి చిట్టెమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
కుటుంబ సభ్యుల వెల్లడిన ప్రకారం, ఆమె అంత్యక్రియలు బుధవారం తిరుపతిలోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు తిరుపతికి రానున్నారు.
Details
కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్న సప్తగిరి
సప్తగిరి కెరీర్ విషయానికి వస్తే, తన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్న ఆయన, ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు.
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' వంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు.
ఇటీవల విడుదలైన 'పెళ్లి కాని ప్రసాద్' చిత్రంలో కూడా హీరోగా నటించిన సప్తగిరి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.