
Mana Shankara Vara Prasad Garu : 'మన శంకర్ వరప్రసాద్ గారు' షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ జాయిన్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌లో ఉంది. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి షూటింగ్ దశలో చురుకైన ప్లానింగ్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారని ఇటీవలే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈరోజు నుంచి ఆయన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా షూటింగ్‌లో చేరారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్‌లో వెంకటేష్ జాయిన్ అయినట్లు చిత్రబృందం తెలిపింది. ప్రీ-క్లైమాక్స్ సీన్‌లో విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంట్రీగా వస్తుందని, సుమారు 30 నిమిషాల పాటు ఆయన స్క్రీన్‌పై కనిపించే అవకాశముందని సమాచారం.
Details
హీరోయిన్ గా నయనతార
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పాపులారిటీ సంపాదించిన బుల్లి రాజు కనిపించనున్నాడు. ఇంకా, ఇప్పటికే రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్‌ను సృష్టించింది. మొదట స్లో పాయిజన్‌లాగా అనిపించినా, ఈ సాంగ్ ప్రేక్షకుల హృదయానికి బాగా కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ జాయిన్ కావడం ద్వారా షూటింగ్ మరింత గరిష్ట ఉత్సాహంతో సాగుతోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోయే సాంగ్ రిలీజ్ అయితే సోషల్ మీడియా దద్దరిల్లిపోవడం ఖాయమని దర్శక, నిర్మాతలు అంచనా వేస్తున్నారు.